రద్దయిన రైలు టికెట్ల రిఫండ్ 3 రోజుల్లో పొందవచ్చు 1 y ago
రైల్వే కౌంటర్లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. టికెట్ క్యాన్సిల్ అయితే రీఫండ్ కోసం ప్రయాణ తేదీ, సమయం నుంచి మూడు రోజుల్లోగా సమీప రైల్వే స్టేషన్లో సంప్రదించాలని పేర్కొంది. కౌంటర్లో టికెట్ ఇచ్చి నగదు పొందాలని తెలిపింది. అయితే ఆన్లైన్ బుకింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, ఆటోమేటిక్గా మూడు రోజుల్లో నగదు ఖాతాలో పడుతుందని వెల్లడించింది.